29-12-2025 12:27:28 AM
బిచ్కుంద, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): బిచ్కుంద మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ జెండాను మండల అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్ ఆవిష్కరించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు.ఐక్యతతో ముందుకు సాగుతూ ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితోపాటు మండల ఉపాధ్యక్షుడు రవి పటేల్, కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు మంచి యోగేష్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్పల్లి సంతోష్, శాఖాపూర్ సర్పంచ్ తుకారం, సాయిని అశోక్ సాయిని బసవరాజ్ ఉత్తం నాయక్ బండు పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్‌లో
నాగిరెడ్డిపేట్,డిసెంబర్ 28 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో పార్టీ జెండా ఎగరవేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు దాటిన అతి పెద్ద పార్టీ అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో జెండా ఎగరవేయడం జరిగిందన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును బిజెపి ప్రభుత్వం తొలగించడం అత్యంత దారుణమని ఇప్పటికైనా ఆలోచించి మహాత్మా గాంధీని గౌరవిస్తూ మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీలో కొనసాగించాలని నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ శాఖ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య,సర్పంచులు సురేందర్ రెడ్డి,సంజీవరావు, మురళి గౌడ్,ప్రభు గౌడ్,శంకర్ నాయక్,బాబయ్య,మండల కమిటీ కోఆర్డినేషన్ సుధాకర్, జీవరత్నం,వసరం నాయక్, సాయిలు, హిమం, టాగూర్, గులాబ్ హుస్సేన్, సురేందర్ గౌడ్, కోనేరు కుమార్, గంపల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.