జీఎస్టీ గూడుపుఠాణి.. రూ.84 కోట్ల దోపిడీ
- నకిలీ ఇన్వాయిస్లతో ఖజానాకు కన్నం
- కేవలం బిల్లులతోనే కోట్ల ఐటీసీ స్వాహా
- కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన డీజీజీఐ..అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో ,మార్చి 13 (విజయక్రాంతి): అక్షరాలా కాగితాల మీద వ్యా పారం చేశారు.. నకిలీ బిల్లులను సృష్టించా రు. ప్రభుత్వానికి చేరాల్సిన వేల కోట్ల రూపాయల పన్ను సొమ్మును పక్కదారి పట్టించా రు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఒక కీలక నింది తుడిని అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కుం భకోణం విలువ వేల కోట్లలో ఉండే అవకాశం ఉందని ప్రాథమిక విచారణలో తేలిం ది. నిందితులు అత్యంత తెలివిగా ఒకే చిరునామాతో లేదా ఉనికిలో లేని చిరునామాల తో పదుల సంఖ్యలో షెల్ కంపెనీలను సృష్టించారు. కూలీలు, చిన్న ఉద్యోగుల నుంచి ఆధార్ , పాన్ కార్డులను సేకరించి, వారికి తెలియకుండానే వారి పేర్లపై జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందారు.ఈ కంపెనీల మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు కాగితాలపై చూపించి, ప్రభుత్వం నుంచి భారీగా ఐటీసీ రిఫండ్లను క్లెయిమ్ చేశారు.
దర్యాప్తులో భాగంగా అధికారులు సదరు కంపెనీల కార్యాలయాలను తనిఖీ చేయగా, అక్కడ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగడం లేదని, కేవలం ఒక చిన్న గదిలోనే వందల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు రికార్డుల్లో చూపించారని తేలింది.ఈ దందాలో కీలక పాత్ర పోషించిన ఒక నిందితుడిని డీజీజీఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు సృష్టించిన నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. వందల కోట్ల మేర ప్రత్యక్ష నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.అయితే, ఈ స్కామ్ కేవలం పన్ను ఎగవేతకే పరిమితం కాలేదని, ఈ డబ్బును హవాలా మార్గాల్లో విదేశాలకు మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడి బ్యాంకు ఖాతాలను, లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.




