12-07-2025 12:00:00 AM
ఖమ్మంలో సంఘటన
కానిస్టేబుల్ల సస్పెండ్, ట్రైనింగ్ సెంటర్ ఏ సి పి అటాచ్మెంట్
ఖమ్మం జులై 11 (విజయ క్రాంతి)తప్పు కొందరిది... శిక్ష అందరిది అన్నట్లు ఉంది ఖమ్మం పోలీస్ సిబ్బంది తీరు. అధికారం అడ్డుపెట్టుకొని రక్షకబటులే దారి దోపిడీదారులుగా మారిన వైనం ఖమ్మంలో చోటు చేసుకుంది. ఓ వ్యాపారి వద్ద పనిచేసే గుమ్మస్తాను అడ్డగించి ఏకంగా రూ 6 లక్షలను దో చుకున్న వైనం వెలుగు చూసింది. ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుల్ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సస్పెండ్ చేయగా, ట్రైనింగ్ ఏసిపి అటాచ్మెంట్ గురయ్యారు.
వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల క్రితం ఓ మిర్చి వ్యాపారి వద్ద పనిచేస్తున్న గుమస్తా తన యజమాని ఆదేశం మేరకు రూ 10 ల క్షలు ఒక వ్యక్తికి ఇచ్చేందుకు బయలుదేరా డు. ఆ సమయంలో నాగరాజు, ఉపేందర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు జీపులో వచ్చి, నీ బ్యాగులో గంజాయి ఉందని సమాచారం ఉంది, బ్యాగును చూపించమని బెదిరించా రు. బిత్తర పోయిన గుమస్తా తన దగ్గర గంజాయి ఎందుకు ఉంటుంది,
మా యజమాని ఆదేశం మేరకు ఓ వ్యక్తికి రూ 10 లక్ష లు ఇచ్చేందుకు వచ్చానని సమాధానమిచ్చా డు. బ్యాగును లాక్కొని దాంట్లో ఉన్న రూ 6 లక్షలను తీసుకొని ఉడయించారు. అవాక్కయిన ఆ గుమస్తా విషయాన్ని రాజస్థాన్లో ఉన్న వ్యాపారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన అనంత రం ఆ వ్యాపారి ఖమ్మం లో యూనియన్ నాయకులతో సంప్రదించి పోలీసు ఉన్నతాధికారులకు కలిసి విషయం తెలిపారు.
పోలీ సు ఉన్నతాధికారులు వారి వద్ద నుంచి రూ 5 లక్షల వ్యాపారికి తిరిగి ఇప్పించారు. పోలీసులతో వివాదం ఎందుకని ఆ వ్యాపారి పో లీస్స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయకు న్నా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విషయం పై విచారణ జరిపించారు. జరిగిన తథంగంలో ఏసీపీ స్తాయి అధికారి, ఒక పత్రిక వి లేకరి హస్తం ఉన్నట్టు అధికారులు తెలుసుకున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కాని స్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సు నీల్ దత్ గురువారం ఆదేశాలు జారీ చేశా రు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు సిటీ ట్రైనింగ్ సెం టర్ ఏసీపీ వద్ద ఒకరు డ్రైవర్ , మరొకరు గ న్ మెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆరోపణ నేపథ్యంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏసీపీని డీజీపీ కార్యాలయానికి అటాచ్మెం ట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం ఉమ్మడి ఖ మ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు పోలీస్ ఉన్నతాధికారులు స్టేషన్కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బా ధితులకు న్యాయం చేయాలని ఆదేశిస్తున్న కొంతమంది కిందిస్థాయి అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తూ రక్షక శాఖకు కలంకం తెస్తున్నారని విమర్శలు తలేత్తుతున్నాయి. దీంతో వామ్మో ఆ కానిస్టేబుల్ లా అంటూ పట్టణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.