బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల కృషి అభినందనీయం
కొత్తగూడెం ఏరియా జీఎం రాజు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27, (విజయక్రాంతి):బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయమని, ఉద్యోగుల నిరంతర శ్రమ, అంకితభావంతోనే సింగరేణి సంస్థ పురోగతి సాధ్యమవుతోందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు అన్నారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్న సందర్భంగా కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్‌లో సోమవారం ఆయనకు అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జీఎం షాలెం రాజు మాట్లాడుతూ.. వర్క్‌షాప్‌లో పనిచేసే టెక్నీషియన్లు, సూపర్వైజర్లు, అధికారులు రాత్రింబవళ్లు కష్టించి పనిచేయడం వల్లే కొత్తగూడెం ఏరి యా బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. అంతకుముందు జరిగి న సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రామవరం ప్రాంతానికి చెందిన షాలెం రాజు అండర్ మేనేజర్గా ప్రస్థానం ప్రారంభించి, క్రమశిక్షణతో జీఎం స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంత రం ఆయనను శాలువాలు, పూలమాలలతో వైభవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారుల ప్రతినిధులు గోవింద రావు, రామకృష్ణ, క్రిస్టోఫర్, కార్మిక సంఘాల నాయకులు మధు కృష్ణ, సత్తార్ పాషా, గుమ్మడి వీరయ్య, మెంగని రోషన్ తదితరులు పాల్గొన్నారు.






