28 July, 2026 | 12:38 AM

కాక్రోచ్‌లతో కలిసి ఉద్యమిస్తాం

28-07-2026 12:14 AM
  1. ఆగస్టు 15 నాటికి ఫీజు బకాయిలు చెల్లించాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): విద్యార్థులను, నిరుద్యోగులను, యువ శక్తిని ఢిల్లీ పాలకులు తక్కువ అంచనా వేశారని, విద్యావ్యవస్థను సర్వనాశనం చేసి, అవినీతి బంధుప్రీతి కుల ప్రీతితో స్కాం లు చేస్తూ, పేపర్లు లీకులు చేస్తూ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలని, దాని ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

సోమవారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ ఉద్యమం పై మీడియాతో మాట్లాడారు. జెన్ జీ ఉద్యమం నేపాల్, బంగ్లాదేశ్ లో ప్రారంభం కాగానే భారతదేశంలో కూడా మొదలవుతుందని తాము అప్పుడే చెప్పామని కానీ నియంతగా వ్యవహరించే ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే వేలాదిమంది కాక్రోచ్‌లతో చలో హైదరాబాద్ నిర్వహించి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు మరో మిలియన్ మార్చ్ చేపడుతామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.