11 March, 2026 | 7:49 PM

కుదుటపడని విద్యార్థుల ఆరోగ్యం

04-11-2024 12:00 AM

హైదరాబాద్‌కు ఇద్దరు విద్యార్థుల తరలింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబ ర్ 3 (విజయక్రాంతి): వాంకిడి మం డలంలోని ఆశ్రమ పాఠశాలలో నాలుగు రోజుల క్రితం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. 35 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారు. మాక్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమించడంతో ఆదివారం వారిని హైదరాబాద్‌కు తరలించారు. మంచిర్యాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే కోవలక్ష్మి పరామర్శించారు.