రేపు కొలువుతీరనున్న గుట్ట పాలకమండలి
- యాదగిరిగుట్ట ముఖ మండపం బంగారు వాకిట్లో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
- దేవస్థానం ఈవో భవాని శంకర్ వెల్లడి
యాదగిరిగుట్ట, జూలై 9 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాలకమండలి సభ్యులచే శనివారం ఉదయం 11:37 గంటలకు దేవస్థానం ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ప్ర మాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో భవాని శంకర్ తెలిపారు. యాదగి రిగుట్ట దేవస్థానంకు 2007 నుంచి 2009 వరకు పాలకమండలి ఉన్నదని, 17 సంవత్సరాల అనంతరం ప్రభు త్వం రెండు సంవత్స రాల కాల పరిమితికి స్వ యం ప్రతిపత్తి కలిగిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేసిందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టను టీటీడీ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చే యాలని, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన దర్శనాలు అయ్యేం దుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. శనివారం రోజున ప్రమాణ స్వీ కారోత్సవానికి వీవీఐపీల తాకిడి అధికంగా ఉం డడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నూతన పాలకమండలి సభ్యులు వీరే
యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా ఎం సత్యనారాయణరెడ్డి, సభ్యులు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురే ఖ, విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ చిలప్పగారి విజయ రాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం రాఘవేందర్, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఎక్స్ అఫీషియో సభ్యులు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వై టి డి ఏ ఉపాధ్యక్షులు జి కిషన్ రావు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె భవాని శంకర్, దేవస్థానం ప్రధాన అర్చకులు కె వెంకటాచార్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.






