10 July, 2026 | 1:04 AM

ఎల్‌నినోపై ఆందోళన వద్దు

10-07-2026 12:00 AM
  1. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
  2. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
  3. అధికారుల సలహాలు తప్పనిసరి
  4. రైతులకు మంత్రి ఉత్తమ్ సూచన
  5. జిల్లాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం 

 హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి) : ఎల్ నినో నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అవసరమైన ప్ర ణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.  అయితే రైతులు సంప్రదా య పంటలు కాకుండా, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి సారించా లని సూచించారు.

రైతులు వాతావరణ శాఖ విడుదల చేస్తున్న వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకో వాలని సూచించారు. ఎల్ నినో పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై గురువారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, ఈఎన్‌సీ రమేష్‌బాబు, వ్యవ సాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్  ప్రత్యక్షంగా,  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ..  ఎల్‌నినో విషఁంలో వదంతులను నమ్మకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శకాలనే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు జిల్లాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయా లని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వా యర్లలో నీటి నిల్వలు, సాగునీటి లభ్యతను సమీక్షించి, వాటికి అనుగుణంగానే  సాగు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని, గ్రామసభలు, రైతు వేదికలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖలలు సమన్వయం తో శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు చేరవేయాలని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో శాస్త్రవేత్తల సిఫారసుల ఆధారంగా రైతులకు సలహాలు ఇవ్వాలని సూచించా రు.   

మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లి సహా గోదా వరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని  ఆదేశించారు. డిమాండ్ మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా అప్ర మత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా దిశానిర్దేశం చేశారు.