26 June, 2026 | 6:33 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

ఇంటి తాళం పగలకొట్టి ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు చోరీ

13-12-2025 12:58 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : ఇంటికి వేసిన తాళం పగులకొట్టి బంగారు ఆభరణాలు, కొంత నగదు ను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ అవుషాపూర్ కు చెందిన కేతవత్ శంకర్ ఈనెల 3వ తేదీన తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి, నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండలోని బాల్యలోక్య తాండాలోని వారి పెద్ద కుమార్తె అయిన స్వర్ణలత ఇంటికి సర్పంచ్ ఎన్నికల ప్రచారం కొరకు  వెళ్లారు.

12వ తేదీ శుక్రవారం ఉదయం 7:00 గంటలకు పక్కింటి వారు ఇంటి తాళం తెరిచి ఉందని దొంగతనం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే అందరూ అక్కడ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఇంటి తాళం పగిలిపోయి ఉంది. లోపలికి వెళ్లి చూడగా, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించారు.

వారు బెడ్ రూమ్ లో తనిఖీ చేసినప్పుడు, షెల్ఫ్ లో ఉంచిన పెట్టె నుండి, బంగారు నల్ల పూసల గొలుసు, బ్రాస్లెట్, ఒక బంగారు గొలుసు మొత్తం బరువు సుమారు 5 తులాలు కనిపించడం లేదు. బంగారు ఆభరణాలతో పాటు, కొన్ని కొత్త బట్టలు (ఇటీవల వారి బట్టల దుకాణం కోసం కొనుగోలు చేసినవి) కొంత నగదు కూడా పోయినవి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.