calender_icon.png 13 December, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా రంగారెడ్డి సేవలు మరువలేనివి..!

13-12-2025 12:57:08 AM

చేవెళ్ల, డిసెంబర్ 12 (విజయక్రాంతి): చేవెళ్లలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన  నాయకుడు  కొండా వెంకట రంగ రెడ్డి జయంతిని చేవెళ్ల లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు  హాజరై విజయవంతం చేశారు. మొదటగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలు, తెలంగాణ కోసం చేసిన పోరాటం, విద్యా రంగానికి చేసిన అమూల్యమైన కృషి గురించి పలువురు మాట్లాడారు.

కొండా వెంకట రంగా రెడ్డి నిబద్ధత, ధైర్యం, ప్రజలపట్ల ప్రేమ ఇవన్ని ఈ తరం నాయకులకు ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. చేవెళ్లలోని యువత, విద్యార్థులు ఆయన స్ఫూర్తిని అనుసరించి సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కొండా రామ్ దేవ్ రెడ్డి, డాక్టర్ మీరా, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి బీజేపీ నాయకులు ఆంజనేయులు గౌడ్, శర్వలింగం, మాణిక్య రెడ్డి, దయాకర్ రెడ్డి,  విఠల్ రెడ్డి,  అశోక్, శ్రీకాంత్ రెడ్డి, చీర శ్రీనివాస్,  పాగా వెంకటేష్,  సత్యనారాయణ,  కృష్ణ,  మోహన్,  కృష్ణారెడ్డి,  రవి,  చందు,  రవి,  శ్రీనివాస్ రెడ్డి,  గన్ని మహేశ్వర్ రెడ్డి,  శ్రీనివాస్,  బాలరాజ్, జయసింహ,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.