13-12-2025 12:59:58 AM
బండ రావిరాల సర్పంచ్ అభ్యర్థి కందికంటి విజయకుమార్
అబ్దుల్లాపూర్ మెట్, డిసెంబర్ 12: అవకాశం ఇవ్వండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని బండ రావిరాల సర్పంచ్ అభ్యర్థి కంది కంటి విజయకుమార్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో మానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ... అవకాశమిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు.
ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామన్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో ట్యూషన్ పాయింట్లు, డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామన్నారు. గుండోజి రంగదాస్ సేవలకు గుర్తుగా విద్యా నిధిని ఏర్పాటుచేసి ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామానికి అన్ని రూట్లలలో బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. గ్రామంలో కోతులు, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
రైతుల కోసం శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. గ్రామానికి ఉచిత వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక ప్రోత్సాహాన్ని కల్పిస్తామన్నారు. తనను గెలిపిస్తే అన్ని వర్గాల సహకారంతో గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానని అన్నారు. అనంతరం గ్రామంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.