16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేలోపు ఇల్లు గుల్ల

17-02-2026 12:23 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాం తి): బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ  జరిగింది. శివరాత్రికి కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘట న బేగంపేట పరిధి శ్యామ్‌లాల్ వద్ద చోటు చేసుకుంది. 30 తులాల బంగారం, 2 కిలోలు  వెండి, రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బేగంపేట శ్యామ్ లాల్ వద్ద సత్యసాయి సిరి సంపద అపార్ట్‌మెంట్స్  మూడవ అంతస్తు 302, ప్లాట్లో వృద్ధురాలు ఎం.అనురాధ (60) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కూతురు ఇంటికి వెళ్లి ఉదయాన్నే తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పాటు బీరువాలో ఉన్న బంగారం వెండి  నగదు కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు జరిగిన తీరును పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సిసి కెమెరాల లో నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.