28 June, 2026 | 2:04 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

దొడ్డి కొమరయ్య ఆశయాలు కొనసాగించాలి

04-04-2026 01:15 AM

కాకతీయ యూనివర్సిటీ,ఏప్రిల్ 3(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనం లో బీసీ సెల్ సంచాలకులు డాక్టర్ బోడిగే సతీష్ అధ్యక్షతన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి రామచంద్రం హాజరై మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాలను యువత కొనసాగించాలని తెలిపారు.

జనగామ తాలూకా కడివెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో విష్ణుర్ దేశ్ముకులకు వ్యతిరేకంగా పోరాడి 19వ ఏటనే  అమరుడైన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్, అకుట్ ప్రెసిడెంట్ ఆచార్య వెంకటరామిరెడ్డి కేయూ అభివృద్ధి అధికారి ఆచార్య వాసుదేవ రెడ్డి ఐ క్యూ ఎస్ సి సంచాలకులుఆచార్య నరసింహ చారి స్టూడెంట్ అఫైర్స్ ఆచార్య మామిడాల ఇస్తారి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ,డాక్టర్ చిర్ర రాజు, యూనివర్సిటీ విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ సూర్యం డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ కేయూ పీఆర్‌ఓ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ విద్యార్థులు పాల్గొన్నారు.