28 August, 2026 | 2:03 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తా

04-04-2026 01:15 AM

జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 

అధ్యక్షులుగా రాంపూర్ సాయి 

నిజామాబాద్ ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని జనం పాట కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ సాయి అన్నారు. శుక్రవారం నగరంలోని కంటేశ్వర్ లో జనం పాట కల్చరల్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కార్యవర్గాన్ని శాలువ పూల మాలతో సన్మానించారు. 

ఈ సందర్భంగా అధ్యక్షులు రాంపూర్ సాయి మాట్లాడుతూ.. జనం నుంచి వచ్చిందే జనం పాట అన్నారు మాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న0దుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ఉన్న కళాకారులను గుర్తించి, సమాజంలో కళకు ఉన్న ప్రాముఖ్యతను మరింత విస్తరించేలా చేస్తామన్నారు. కళా రంగంలో కళాకారులకు ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు.

కళ కోసం తపించి, కళ కోసమే బ్రతికే కళాకారులు ఎందరో ఉన్నారని, వారందరికీ జనం పాట ఓ వేదిక కల్పించనుందన్నారు. గ్రామ మండలాలో ఉన్న కళాకారులు సభ్యత్వం తీసుకోవాలన్నారు. (21 మంది కళాకారులతో రెండు సంవత్సరాల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.

గౌరవ అధ్యక్షులుగా పస్క నర్సన్న, అధ్యక్షులుగా రాంపూర్ సాయి, ఉపాధ్యక్షులు రాజేందర్ చిన్న, ప్రశాంత్ రెడ్డి, సవిత లు, ప్రధాన కార్యదర్శిగా నల్ల మహేందర్,కోశాధికారి గోరకంటి రాజు, కార్యనిర్వహక కార్యదర్శి కర్క రమేష్, సహాయ కార్యదర్శులుగా ఏ. చిట్టిబాబు, డప్పు సంతోష్, సలహాదారులు: ఆర్టీసీ మల్లన్న, కోకిల నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా నవీన్, సోనీ, డప్పు మహేష్, గణేష్, గోపాల్, ఆలెపు నరేష్, స్రవంతి, పద్మ, సతీష్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.