calender_icon.png 11 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ

11-11-2025 12:00:00 AM

కొల్లాపూర్ టౌన్, నవంబర్ 10 : పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో గంగపుత్రల ఆహ్వానం మేరకు నిర్వహించిన గంగమ్మ దేవాలయ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్థంభ వేడుకల్లో ప్రజా వైద్యులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. కల్వకోల్,  కొల్లాపూర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తల్లి గంగమ్మ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్, భయ్య వెంకటస్వామి, పొట్టినేని గోపాలకృష్ణనాయుడు, రిటైర్డ్ డీఈఓ విజయ్కుమార్, గాలెన్న, నరసింహ, పెద్దయ్య, హుస్సేను, ధర్గేష్, గడికోపుల శివప్రసాద్, కొమ్ముల ఆంజనేయులు, పరశురాం, పెబ్బేటి మల్లేష్, కొప్పునూరు సొసైటీ అధ్యక్షుడు మధు, పెబ్బేటి ఆంజనేయులు, గంగపుత్ర కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.