11-11-2025 12:03:39 AM
యాదాద్రి భువనగిరి నవంబర్ 10 ( విజయక్రాంతి ): తెలంగాణ జయ జయహే తెలంగాణ గేయ రచయిత శ్రీ అందెశ్రీ మరణం పట్ల ఆయన ఆత్మకు శాంతి కలగాలని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మౌనం పాటించి జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డి.ఆర్. ఓ జయమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో
కోదాడ నవంబర్ 10: పట్టణఁలోని ఎం ఎస్ కాలేజీ లో ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రజా కవి అందెశ్రీ మృతి పట్ల సోమవారం సంతాపం తెలిపి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపుడి చిన్ని మాట్లాడుతూ అట్టడుగు వాడల్లో పుట్టి అశేష ప్రజల పక్షాన పల్లవించిన వాగ్గేయకారుడు అందెశ్రీ మరణం బాధాకరమని, ప్రజా ఉద్యమాలకు నష్టదాయకమని తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన ఆణిముత్యం లాంటి సాహితీ కుసుమం హఠాత్తుగా రాలిపోవడానికి చింతిస్తు విచారం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సి ఈ వో యస్ యస్ రావు,పెయింటర్ బాబు,వి.నరసింహారావు,యం యస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ ,అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, తదితరులు పాల్గొన్నారు.