calender_icon.png 12 October, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధుల్లో ఆర్థరైటిస్ ప్రభావం

12-10-2025 12:52:57 AM

అవగాహనతోనే ముందస్తు నివారణ

వృద్ధాప్యంలో చాలా మందికి మోకాళ్లు, చేతులు లేదా పాదాల్లో నొప్పి, గట్టితనం కారణంగా రోజువారీ పనులు కూడా కష్టంగా మారతాయి. సంధుల వాపు లేదా ఆర్థరైటిస్ ఈ సమస్యకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న జరుపుకునే ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా ఉంటుంది. ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం 2025 సందర్భంగా, వృద్ధులు ఎలా చురుకుగా, నొప్పిలేకుండా జీవించగలరో తెలుసుకోవడం చాలా అవసరం.

భారతదేశంలో పెరుగుతున్న ధోరణి

తాజా అధ్యయనాల ప్రకారం.. భారతీయ వృద్ధ పురుషుల్లో మోకాలి ఆస్టియోఆర్థరైటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2025లో విడుదలైన మెటా-అనాలిసిస్ (14 అధ్యయనాల ఆధారంగా) ప్రకారం.. భారత వృద్ధ పురుషుల్లో 26.2శాతం మంది ఆస్టియోఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. అంతర్జాతీయంగా 2022 నివేదిక ప్రకారం, 60 ఏళ్లకు పైబడి ఉన్న పురుషుల్లో 10శాతం మందికి ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఉంటే, 70 ఏళ్లకు పైబడినవారిలో ఈ శాతం 40శాతం వరకు పెరుగుతోంది.

2021లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగిన అధ్యయనంలో ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వృద్ధుల్లో శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిలోనూ జీవన నాణ్యత తగ్గిందని తేలింది. ఈ గణాంకాలు సమయానికి గుర్తించి, సరైన చికిత్స ప్రారంభించడం ఎంత ముఖ్యమో సూచిస్తున్నాయి. వృద్ధాప్యంలో కూడా సంధులను ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమే. ప్రతిరోజూ పాటించే చిన్న అలవాట్లతోనే నొప్పిని తగ్గించి చురుకైన జీవితం కొనసాగించవచ్చు.

ఆర్థరైటిస్ అంటే ఏమిటి?

ఆర్థరైటిస్ అనేది సంధుల్లో వాపు, నొప్పి, గట్టితనం, కదలికలలో తగ్గుదల కలిగించే పరిస్థితి. వృద్ధుల్లో సాధారణంగా కనిపించే రెండు ప్రధాన రకాలవి:

ఆస్టియోఆర్థరైటిస్ (ఓఏ): వయస్సుతో సంధుల మధ్య ఉన్న కార్టిలేజ్ మృదువైన పొర క్రమంగా క్షీణించడం వల్ల ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోవడం జరుగుతుంది. దీని వల్ల నొప్పి, గట్టితనం వస్తుంది. వయస్సు, అధిక బరువు, గాయాలు, వంశపారంపర్య కారణాలు ప్రమాదకర అంశాలు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ): ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. శరీర రక్షణ వ్యవస్థ పొరపాటున సంధుల కణజాలాలపై దాడి చేస్తుంది. చికిత్స లేకపోతే దీర్ఘకాలిక వాపు, వక్రత, సంధి నష్టం కలుగుతుంది. ఈ రెండు రకాల ఆర్థరైటిస్ వృద్ధుల కదలికను తగ్గించి, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే సకాలంలో సంధి సంరక్షణ, చురుకైన జీవనశైలి చాలా అవసరం.

చురుకుగా ఉండటానికి 10 సూచనలు

క్రమం తప్పని వ్యాయామం: వాకింగ్, ఈత, లేదా యోగా వంటి తేలికైన వ్యాయామాలు సంధుల కదలికను మెరుగుపరుస్తాయి.

బరువును నియంత్రించడం: అధిక బరువు మోకాళ్లు, నడుము వంటి సంధులపై ఒత్తిడిని పెంచుతుంది.

మందులు సక్రమంగా వాడకం: వైద్యుడు సూచించిన మందులను సమయానికి తీసుకోవడం వలన వాపు, నొప్పి నియంత్రణలో ఉంటాయి.

సంధులను రక్షించడం: కర్రలు, బ్రేసులు, సౌకర్యవంతమైన పాదరక్షలు వాడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

తగిన విశ్రాంతి: సరైన నిద్ర శరీర పునరుద్ధరణకు సహాయపడుతుంది.

వెచ్చదనం, చల్లదనం చికిత్సలు: వేడి ప్యాడ్లు గట్టితనాన్ని తగ్గిస్తాయి. చల్లని ప్యాక్లు వాపు తగ్గిస్తాయి.

ఆహారం: చేపలు, కందులు, ఆకుకూరలు వంటి ఒమేగా3, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి.

తగినంత నీరు: సంధులు సులభంగా కదిలేందుకు నీరు కీలకం.

మానసిక ప్రశాంతత: ధ్యానం, మైండ్ఫుల్నెస్, శ్వాసాభ్యాసాలు నొప్పి, ఒత్తిడిని తగ్గిస్తాయి.

క్రమం తప్పకుండా వైద్యుడ్ని కలవడం: ఆర్థరైటిస్ పురోగతిని పర్యవేక్షించి, చికిత్సను అ వసరానుసారం సవరించుకోవడం ముఖ్యం.

వృద్ధాప్యంలో ఆర్థరైటిస్తో జీవించడం కష్టం అనిపించినా, సరైన అలవాట్లు, సకాల వైద్యం ద్వారా నొప్పిలేని, స్వతంత్ర జీవనం కొనసాగించవచ్చు. జీవనశైలి మార్పులు, వైద్య సూచనలు కలిసి పనిచేస్తే, నొప్పి తగ్గి జీవన నాణ్యత మెరుగుపడుతుంది.

మీరు లే దా మీ కుటుంబ సభ్యులు ఆర్థరైటిస్తో ఇ బ్బంది పడుతున్నట్లయితే, నిపుణుల సహా యం పొందడం ఆలస్యం చేయకండి. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కొండాపూర్ ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలు, వ్యక్తిగత సలహాలతో సంధి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో మీకు తోడ్పడుతుంది. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, నొప్పిలేని జీవితానికి తొలి అడుగు వేయండి.