calender_icon.png 20 February, 2026 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపోల్స్‌లో టీఆర్పీ ప్రభావం

20-02-2026 12:56:39 AM

  1.   5 నెలల్లోనే గెలుపోటములను నిర్ణయించే స్థాయికి చేరాం
  2. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడింది
  3. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తాం
  4. బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధనకు పోరాటం
  5. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)ని స్థాపించి కేవలం ఐదు నెలల్లోనే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపిందని పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయికి పార్టీ ఎదగడం శుభపరిణామమన్నారు. టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం తీన్మార్ మల్లన్న అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మా దం రజినీకుమార్‌యాదవ్, సుధగాని హరిశంకర్ గౌడ్ హాజరయ్యారు. సమావేశం ప్రారం భంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విస్తృతంగా చర్చించారు. కత్తెర గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన జమ్మికుంట మున్సిపల్ వార్డ్ సభ్యుడు ఫిరోజ్‌ను, అలాగే సూర్యాపేట జిల్లాలో మెజారిటీ ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించారు.

పార్టీ స్థాపించి కేవలం ఐదు నెల ల వ్యవధిలోనే 28 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల విజయాలను నిర్ణయించే స్థాయికి ఎదగడం గొప్ప విజయమని మల్లన్న పే ర్కొన్నారు. టీఆర్పీ అభ్యర్థుల గెలపునకు జిల్లాల వారీగా కృషి చేసిన బా ధ్యులను ఈ సమావేశంలో ఆయన ప్రశంసిం చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడిన కాం గ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలతో, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపి ణీ చేసి ఓటర్లను మభ్యపెట్టి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా ప్రజ ల మద్దతు పొందినందుకు టీఆర్పీ నాయకత్వాన్ని, కార్యకర్తలను అభినందించారు.  రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. 

 బీసీలకు 42 శా తం రిజర్వేషన్ సాధించడానికి పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. బీసీలకు జరుగు తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో ఆందోళనలు చేపట్టాలని తీన్మార్ మల్లన్న పిలుపు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అనుబంధ సంఘాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి కార్యాచరణను మరింత చురుకుగా చేయాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి పండేల్, వేములవాడ మదన్ మోహన్ చారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, కోశాధికారి కలివేముల మధుబాబు, ఉపకోశాధికారి కొక్కల కొండ మనోజ్, రాష్ట్ర కార్యదర్శులు పసల ప్రసన్న, ఆర్ భావనవెంకటేష్, నగేష్‌ముదిరాజ్, రమేష్‌యాదవ్, కొమ్ముల ప్రవీణ్‌రాజ్, శివవీర్‌రెడ్డి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజగౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్పీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజుగౌడ్

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, ప్రజా హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మరింత బలం చేకూరే విధంగా కీలక నియామకం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ ఆమోదంతో పార్టీ బలోపేతం, విస్తరణ లక్ష్యంగా రాజుగౌడ్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న నియమించారు.

ఈ నియామక పత్రాన్ని రాజుగౌడ్‌కు హైదరాబాద్‌లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో తీన్మార్ మల్లన్న అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాజుగౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి శక్తిని ఏకం చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. 

మరుగుజ్జు అసోసియేషన్ రజితోత్సవానికి..

మరుగుజ్జు అసోసియేషన్ రజితోత్సవ ఆత్మీ య సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రావాలని టీఆ ర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆహ్వానించారు. మరుగుజ్జు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.మల్లేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ని టీఆర్పీ ప్రధాన కార్యాలయంలో తీన్మార్ మల్లన్నను గురువారం మర్యాదపూర్వంగా కలిసి, ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

వారి ఆహ్వానాన్ని సాదరం గా స్వీకరించిన మల్లన్న తప్పకుండా హాజరవుతా నని హామీ ఇచ్చారు. అదేవిధంగా సంఘం కార్యక్రమ నిర్వహణకు తన వంతు సహాయంగా రూ.20 వేల సహాయం ప్రకటించారు. ఈ చెక్కును టీఆర్పీ రాష్ట్ర నాయకులు సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా  మరుగుజ్జు సామాజిక, ఆర్థి క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.