ఆ చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చేది ఇండియా స్టోరీ
19-07-2026 01:16 AM
‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ ట్రైలర్ విడుదలైంది. ఇది పురుగుమందుల సాగు అనే ఆందోళనకరమైన సమస్యను, సమాజంపై దాని ప్రభావాలను వెలుగులోకి తెస్తుంది. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్, స్టూడియోస్ తెరకెక్కిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బీ షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రం జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా.. పురుగు మందుల వెనుక దాగి ఉన్న చేదు నిజాన్ని వెలుగులోకి తీసుకురానుందన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.






