19 July, 2026 | 3:37 AM

హే చికీతాతో అందరికీ మంచి పేరు రావాలి

19-07-2026 01:11 AM

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్‌ఎన్‌ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు.

ఈ సినిమాను జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో గరుడవేగ అంజి మాట్లాడుతూ .. “ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. నిర్మాత ఎన్.అశోక ఆర్‌ఎన్‌ఎస్ మాట్లాడుతూ.. “అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. “రైతులు, యూత్ కోసం ఈ మూవీని చేశాను’ అని అన్నారు.

అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. ‘జూలై 24న మా చిత్రం అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ.. “హే చికీతా’ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు. నటి తన్మయ్ ఖుషి, చరణ్ అర్జున్, దేవి ప్రసాద్, నటి యోధ మాట్లాడుతూ .. ‘ధన్ రాజ్ అన్న వల్లే నాకు ‘హే చికీతా’లో అవకాశం వచ్చింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ధన్ రాజ్ అన్న, నిర్మాత అంజి అన్న, అశోక్ అన్నకి థాంక్స్. జూలై 24న మా సినిమాని చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.