calender_icon.png 15 May, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతజాతి మరవలేని మేలురత్నం

13-04-2025 12:00:00 AM

ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒకవ్యక్తి కాదు. ఆయన ఒక మహాశక్తి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద, లిఖిత రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీల పా త్ర పోషించారు. అత్యున్నత రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చిన మహనీయులు ఆయ న. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, ఉద్యోగాలు, హక్కులు, రాజకీయ పదవులు ఇలా అన్నీ ఒక రకం గా ఆయన ప్రసాదించిన వరాలు.

దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొనే బాబా సాహెబ్ మన రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ ప్రపంచం మెచ్చిన వి ద్యావేత్త. స్వార్థంతో ఆయన ఆలోచిస్తే ఎ న్నో పదవులను అలంకరించి ఉండేవారు. కానీ, తాను అలా చేయలేదు. కుల వివక్ష తో బాల్యం నుంచే ఆయన ఎన్నో కష్టాల ను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ బట్టలు ఉ తకడానికి, క్షవరం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

దీంతో ఆయన సోదరులే ఆయనకు ఆ అవసరాలను తీర్చారు. గోరేగావ్‌లోని తండ్రివద్దకు వెళ్లడానికి అనే క ఇబ్బందులు పడ్డారు. అంటరానితనం కారణంగా మసూర్ రైల్వే స్టేషన్ నుంచి గోరేగావ్‌కు తీసుకెళ్లేందుకు ఎండ్లబండి వాళ్లు సైతం విముఖత వ్యక్తం చేశారు. అ టువంటి సందర్భంలో స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాళ్లకు ఎక్కువ డబ్బు లు ఇచ్చి మరీ అంబేద్కర్ సోదరులే సొం తంగా బండి నడుపుకుంటూ వెళ్లారు.

ఈ రకంగా అంబేద్కర్ జీవితంలో అనుభవించిన బాధలు వర్ణాతీతం. ఆ మహానుభా వుడు చేసిన మేలు వల్లే ఈరోజు వెనుకబడిన, అల్ప సంఖ్యాక, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఆదివాసీలు మెరుగైన జీవనాన్ని గడుప గలుగుతున్నారు. అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా అందించాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. అందువల్లే బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వే షన్లు కల్పించారు. నేడు అమలులో ఉన్న అట్రాసిటీ, ఆదివాసీ చట్టాలన్నీ వారి మే ధోమథనం నుంచి పుట్టినవే. సమాజంలోంచి పూర్తిగా అంటరానితనాన్ని నిర్మూ లించేందుకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను చేర్చారు.

తిలక్ నినాదం వేరేగా ఉండేది..

1927లో అంబేద్కర్ ‘బహిష్కృత్ భార త్’ అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించా రు. అందులో అంబేద్కర్ రాసిన ఒక వ్యా సంలో ఇలా పేర్కొన్నారు. తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ఉండడు, ‘అస్పృశ్యత నివారణే నా ధ్యేయం, జన్మహక్కు’ అని ప్రకటించి ఉండేవారని తన వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. ఆయనలోని ఈ రకమైన భావజాలాన్నిబట్టి ఆనాడు కులతత్వ వాదులు తనను ఎంతగా బాధ పెట్టారో అ ర్థం చేసుకోవచ్చు. 1927లో ఛత్రపతి శివా జీ జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంత టా గొప్పగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఆ వేడుకలకు అంబేద్కర్ హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ, పేశ్వ సామాజ్య పతనానికి అస్పృశ్యతే కారణమని అన్నారు.

ప్రత్యేక నియోజక వర్గాల డిమాండ్

దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో 1930, 1931 సమావేశాల సందర్భంగా అంబేద్కర్‌కు గాంధీకి మధ్య బేధాభిప్రాయాలు వ చ్చాయి. ప్రత్యేక నియోజక వర్గాల కోసం అంబేద్కర్ పట్టుపడితే, గాంధీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో అంబేద్కర్ ఆ సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. అయితే, 1932లో ఆయనకు రామ్ సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత దళితులకు ప్రత్యేక నియోజక వర్గం ప్రతిపాదించారు.

అయినప్పటికీ సరైన న్యాయ ం జరగక పోవడంతో దళితుల సమస్యల పరిష్కారానికి అఖిల భారత అణగారిన తరగతుల కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ సంస్థలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా దళితు ల అభ్యున్నతికి కృషి చేశారు. హిందూ స మాజంలోని అసమానతలు, కులం పట్టింపుల ప్రభావంతో అంబేద్కర్ తన యాభై ఆరవ యేట బౌద్ధమతాన్ని స్వీకరించారు. 1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో బౌద్ధమతంలోకి మారారు. గాంధీతో అనే క విషయాల్లో విభేదించిన ఆయన మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరమైన దాన్ని ఎ న్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమేనని, తన మత మార్పిడివల్ల దేశచరిత్ర, సంస్కృతులు ప్రభావితం కా కుండా చూశానని అన్నారు. 

మేధావుల్లో ఆయన ఒకరు

సాంఘిక సంస్కరణల కోసం అంబేద్క ర్ అనేక గ్రంథాలు రాశారు. అందులో ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపి’, ‘ప్రొవెన్షియల్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంటీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’, ‘ది బుద్ధ అండ్ హి జ్ ధర్మ’ అనే రచనలు ప్రధానమైనవి. అం బేద్కర్‌ను ప్రసిద్ధ రచయిత డెవెర్లీ నికోలస్  భారతదేశంలోని ఆరుగురు మేధావుల్లో ఒకరిగా అభివర్ణించారు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ బీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 మహాపరి నిర్వాణం చెందారు. సంఘసంస్కర్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, విద్యావేత్తగా గుర్తింపు పొం దిన ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి దేశం తన గౌరవాన్ని నిలబెట్టుకుంది.

దే శంలోని ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉంది. అయితే, ఇది కేవలం దళితులఓట్లు దక్కించుకోవడానికిగానీ స మా జ అభ్యుదయం కోసం కాదనే విమర్శలు కూడా ఉన్నాయి. భారతదేశ రాజ్యాంగ ఔన్నత్యానికి ఆయనే కలికితురాయి. ఎంత అత్యున్నత రాజ్యాంగం ఉన్నా పాలకులు సమర్థులు కాకపోతే ఫలితాలు వేరుగా ఉం టాయి. అందుకే సమాజంలో ఓటుబ్యాం కు రాజకీయం పోవాలి. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రతి భారతీయుడు పొందిన రోజే ఆయనకు నివాళి. కులం స్థానంలో ఆప్యాయత, మతం స్థానంలో మానవత అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. 

అక్షర జ్వాలై..

ఈ శతాబ్దపు చరితలో 

నేటి మేటి మేధావిగా

విదేశీ విశ్వవిద్యాలయాల్లో 

విలువైన పాఠ్యపుస్తకంగా

మన దేశపు ముఖచిత్రమై

భవిష్యత్ తరాలకు భరోసా భానుడిగా

అంబేద్కర్ ఆలోచనలు

అంతరిక్షంలో రాకెట్‌లా 

విశ్వవ్యాప్తమయ్యాయి..

అస్పృశ్యతను అణగదొక్కి

వివక్షను అదృశ్యం చేసి

స్వేచ్ఛా సమానత్వపు సమాజంలో 

సందేశమై సంచరిస్తున్నాయి..

ప్రజాస్వామ్యానికి ఓటేస్తూ

నిన్ను నువ్వే పాలించుకోవాలని

అజ్ఞానాన్ని తరిమేస్తూ

నిన్ను నువ్వే సంస్కరించుకోవాలని

అక్షర ఆవేశమే 

అన్నింటినీ పరిష్కరిస్తుందని

దేశభక్తికి నీ దేహమే దేవాలయమై

రాజ్యాంగాన్ని పవిత్రగ్రంథంగా చూడాలని

మూఢ నమ్మకాల జాడను వదిలించి

శాస్త్రీయ స్వప్నంలో 

సావాసం చేయాలని

మరో బుద్దుడిలా అంబేద్కర్ మార్గం

మనకు దారి చూపిస్తూనే వుంది!

కాలంపై అక్షరజ్వాలై 

ప్రకాశిస్తూనే వుంది!

 -ఫిజిక్స్ అరుణ్ కుమార్ 9394749536


వ్యాసకర్త: ఉమాశేషారావు వైద్య, సెల్: 9440408080