calender_icon.png 15 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘న్యాయపథం’తో భవిష్యత్తుకు భరోసా

13-04-2025 12:00:00 AM

దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన కాం గ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు అహ్మదాబాద్ వేదికగా శంఖం పూరిం చింది. బీజేపీ నియంతృత్వ పోకడలతో రాజ్యాంగానికి, లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడడంతోపాటు దేశం అన్ని రంగాల్లో వెనుకబడుతున్న తరుణంలో జరిగిన 86వ ఏఐసీసీ సమావేశం దేశ ప్రజల్లో భరోసా కల్పించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

పవిత్ర రాజ్యాంగాన్ని మార్చా లని కుట్రలు పన్నుతూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, దేశంలోని అన్ని వ్యవస్థలను నీరుగారుస్తూ, ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టిస్తూ దేశాన్ని అంధకారంలోకి నెడుతున్న బీజేపీ ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట వేసేలా కాంగ్రెస్ కదనరంగంలోకి దిగుతోంది.

కాంగ్రెస్ పార్టీ దేశం కోసం బలిదానాలు చేస్తే దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడా లేని బీజేపీ ఇప్పుడు సమరయోధులను కించపరుస్తున్నది. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం తమ జీవితాలనే ధారపోస్తే బీజేపీ అభూత కల్పనలతో చరిత్రను వక్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన స్వస్థలం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పటేల్ స్మారకం వద్ద ఏఐసీసీ సమావేశాలను జరిగాయి. గాంధీ, నెహ్రూ, పటేల్‌ల స్ఫూర్తితో దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఏఐసీసీ మార్గదర్శకం చేసింది.

గాంధీ, నెహ్రూ, పటేల్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకపోయినా బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు స మాచారాన్ని ప్రచారం చేస్తున్నదని చెబుతూ దీన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకతపై సమావేశంలో చర్చించారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించే కాంగ్రెస్ లో తొలినాటి నుంచి నెహ్రూ అయినా, పటేల్ అ యినా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించి సమి ష్టి నిర్ణయాలు తీసుకునేవారు. కాని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వలె కాంగ్రెస్‌లో ఒంటెత్తు పోకడలు మొదటి నుంచి లేవు. దేశంలో ప్ర స్తుతం బీజేపీ పాలన గత బ్రిటిష్ పాలనలా ఉందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ తీర్మానాలు చేసింది.

సమైక్యతకు అవరోధం

అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశంలో అన్ని రంగాలకు భరోసా కల్పించేలా తీర్మానాలు జరిగాయి. రైతులకు అండగా నిలుస్తూ, స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికిన గాంధీ, వల్లభాయ్ పటేల్‌లను స్ఫూ ర్తిగా తీసుకుంటూ బీజేపీ వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ, చట్టబద్ధంగా పంటలకు మద్దతు ధర కల్పించేందుకు అన్నదాత లకు అండగా నిలవాలని నిర్ణయించింది. జవహర్‌లాల్ నెహ్రూ మార్గదర్శకంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 560 కిపైగా సంస్థా నాలను దేశంలో విలీనం చేసి భారత్‌ను బలోపేతం చేయ గా, ప్రస్తుతం బీజేపీ దేశంలో ఐక్యతను దెబ్బతీస్తూ ప్రాం తీయ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది.

దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కాంగ్రెస్ తీర్మా నించింది. బ్రిటిష్ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాం గ్రెస్ స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చింది. మన్మో హన్ సింగ్ ప్రభుత్వం దూరదృష్టితో తెచ్చిన ఉపా ధి హామీ చట్టాన్ని నరేంద్ర మోదీ సర్కార్ నీరు గారుర్చడాన్ని పార్టీ తప్పు పట్టింది.

విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్లో అభద్రతా భావం కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడాలని కాంగ్రెస్ తీర్మానించింది. గతంలో బ్రిటిష్ పాలకులు దేశ వనరులను, సంపదను అక్రమంగా దో చుకుంటే, ఇప్పుడు బీజేపీ కూడా కార్పొరేట్ రంగాలకు దేశ వనరులను, సంపదను దోచిపెడుతోంది. బీజేపీ పాలనలో పేదవాడు మరింత పేద వాడుగా మారి తే, ధనవంతులు మరింత ధనవంతులయ్యారు. బ డా వ్యాపారస్తులు బ్యాంకురుణాలను ఎగ్గొట్టి దే శం విడిచి పారిపోతుంటే బీజేపీ సహకరిస్తున్నది.

దేశంలో ఆర్థిక అసమానతలు, ప్రజలమధ్య అం తరం పెరగడంపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీ అహింసా మార్గం స్ఫూ ర్తిగా దేశంలో హింస, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం చేశారు. మహాత్మాగాంధీ హత్యానంతరం వల్లభాయ్ పటేల్ ఆర్ ఎస్‌ఎస్‌ను నిషేధిస్తే, దాని మార్గదర్శకత్వంలోనే బీజేపీ దేశా న్ని పాలిస్తుండడం దురదృష్టకరం.  

సామాజిక న్యాయానికి శ్రీకారం

జాతీయత పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సృష్టిస్తున్న కుల మత ప్రాంత రాజకీయాలను సమా వేశంలో పార్టీ ఎండగట్టింది. కాంగ్రెస్ జాతీయవా దం దేశ ప్రజలను ఏకం చేస్తే బీజేపీ జాతీయ వా దం భారత సమాజాన్ని విభజిస్తోంది. భావోద్వేగాలను రెచ్చగొట్టే ఎజెండాతో బీజేపీ మైనార్టీల్లో అభ ద్రతాభావాన్ని కల్పిస్తుంది. ముస్లిం మైనార్టీలపై కక్షగట్టిన బీజేపీ మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటూ వక్ఫ్ బోర్టు చట్టానికి సవరణలు చేయడం ద్వారా వారి మనోభావా లకు భం గం కలిగించింది. యూపీ, మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాల్లో సున్నితమైన అం శాలను తెరపైకి తెస్తూ మతకలహాలను సృ ష్టించడమే కాక ఉన్నత న్యాయస్థానం తప్పు పడుతున్నా బుల్డోజర్ పాలన సా గిస్తోంది. మైనార్టీల్లో విశ్వాసం, భరోసా కలింగించేందుకు ముందుండి వారికి రక్షణగా నిలవా ల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ గుర్తించింది.

జనాభాలో అధిక శాతంగా ఉన్న నిరుపే ద బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కేలా బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రె స్ పలు సూచనలు, సలహాలు ఇస్తున్నా వా రు పెడచెవిన పెడు తున్నారు. నిబంధనల ప్రకారం 2021లో చేపట్టాల్సిన జనగణనను వెంటనే నిర్వహించాలని పార్టీ పలు వేదికలపై డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఉద్దేశ పూర్వకంగా వా యిదా వేస్తోంది.

రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తి వేసేందు కు తక్షణమే జనగణ న, అందులో భాగంగా కులగణన  నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. కుల గణన ద్వారా జనాభా ఆధారంగా సంబంధిత  మాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. సామాజిక న్యాయం కోసం దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ డిమాండ్ చేసింది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ గతంలో చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర సందర్భంగా దేశంలో కులగణన ఆవశ్యకతను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా పట్టించుకోలేదు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ

కులగణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించనందున కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రయోగాత్మకంగా శాస్త్రీయ పద్ధతిలో విజయవంతంగా పూర్తి చేసి, దేశానికే ఆద ర్శంగా నిలిచింది. 

ఇంతేకాక దానికి అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు ఆ ఫలాలు అందాలనే లక్ష్యంతో రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చారిత్రాత్మకమైన బిల్లును ఆమోదించింది. దీనికి చట్టబద్ధత కల్పించడం ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం చేతిలో ఉన్నా నిర్లక్ష్య ధోరణితో ఉంది. 

అహ్మదాబాద్ వేదికగా తెలంగాణ కులగణన ను ఏఐసీసీ అభినందించడం రాష్ట్ర కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు అందరికీ గర్వకారణం. రాష్ట్రాల మధ్య పక్ష పాతం చూపిస్తూ బీజేపీ ప్రభు త్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా పాలిస్తోంది. బీజేపీ విద్వేష ఎజెండాను రాష్ట్రాల అనుమతి లే కుండా ఒంటెత్తు పోకడలతో అన్ని రాష్ట్రాలపై రుద్దడాన్ని ఏఐసీసీ తప్పుపట్టింది. జీఎస్టీతో రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపులలో వివక్ష చూపిస్తోంది.

 ప్రధానంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్డీఏ యేతర రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నది. తెలంగాణకు గత 11 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో గుండు సున్నానే ఇచ్చింది. విభజన హా మీలు, నిధులు, పథకాల కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వానికి ఉన్న సవతి తల్లి ప్రేమ తెలిసిందే. స్వతంత్రంగా ఉండాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి వాడుకుంటోంది. పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత లను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ ఏజెన్సీలద్వారా విచారణ పేరుతో వేధిస్తోంది. 

చివరికి పారదర్శకంగా ఉండాల్సిన ఎన్నికల సంఘంపైనా అను మానాలు రేకెత్తించేలా బీజేపీ వ్యవహరిస్తోంది. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాం గం, లౌకికవాదం, సామాజిక న్యాయం పరిరక్షణకు కృషి చేయాలని ‘న్యాయపథ్’ పేరిట ఏఐ సీసీ అహ్మదాబాద్ వేదికగా పిలుపు నిచ్చింది. 

వ్యాసకర్త : బి.మహేశ్ కుమార్‌గౌడ్ , ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు