5 June, 2026 | 1:50 AM

షెడ్యూల్ కులాల భూముల సేకరణ సమస్యను పరిష్కరించాలి

05-06-2026 01:11 AM
  1. మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి 
  2. వ్యవస్థాపక అధ్యక్షుడు మోత్కుపల్లి నరసింహులు

ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ కులాలకు చెందిన భూముల సేకరణకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి మో త్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో మాది గ మహాశక్తి ప్రతినిధులతో కలిసి ఆయన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎస్సీలకు సాగుకు పనికిరాని భూములు, రాళ్లు, గుట్టలు ఉన్న భూములను ఇచ్చారన్నారు. కాలక్రమేణా దళితులు కష్టపడి ఆ భూము ల్లో రాళ్లను, బండలను తొలగించేసి, సాగు దిశగా మళ్లించి, పంటలు పండించుకొంటున్నారని తెలిపారు. రానురాను ధరలు పెరిగి న నేపథ్యంలో ప్రభుత్వాలకు, భూస్వాములకు, కాంట్రాక్టర్లకు ఆ భూముల మీద కన్నే సి, ఆ భూ యజమాన్యాలకు ఎంతోకొంత డబ్బులు చెల్లించి, తిరిగి బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ఇటీవల తాను ఇబ్రహీంపట్నం మం డలం, రంగారెడ్డి జిల్లా, బండరావిరాల గ్రా మానికి వెళ్లానన్నారు. అక్కడి దళితులకు 135 ఎకరాల భూమిని 50 ఏళ్ల కిత్రం ఇచ్చారని, ఆ భూమిలో బ్రహ్మండంగా సాగు చేసుకొంటున్నారు  కానీ, ఆ భూమి మొత్తా న్ని తిరిగి ప్రభుత్వం తీసుకొని కనీసం పరిహా రం కూడా ఇవ్వలేదని,  ఇది చాలా బాధాకరం అని మోత్కుపల్లి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితుల చాలాచోట్ల ఉన్నాయని ఆయన వివరించారు.

భూ సేకరణలో దళితుల భూములను లక్ష్యంగా చేసు కోవడం సరికాదన్నారు. అవసరమైతే ప్రభు త్వ భూమిని, ప్రైవేట్ భూములను కొనాలని ఆయన సూచించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాదిగ మహాశక్తి నేతలు విజయకుమార్, కనకయ్య, నతానియేల్, వీరాస్వామి, నర్సింహ, మురళీ, దర్శన్, శివ, గిరి, వాసు, శ్రీనివాస్, శంకర్, వంగాల అవినాష్, తదితరులు పాల్గొన్నారు.