టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండూరి కిరణ్ కుమార్
కల్లూరు, జూన్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నుంచి కొండూరి కిరణ్ కుమార్ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏఐసీసీ ఎస్సీ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రం అందజేశారు.
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం శాంతినగర్ కి చెందిన కిరణ్కు ఈ గౌరవం దక్కడం పట్ల ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయానంద్ సహా పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ తాను ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీగా పనిచేసి, ఎస్సీ స్టేట్ కన్వీనర్గా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని తెలిపారు.
డిజిటల్ సభ్యత్వం ద్వారా పలువురిని పార్టీలో చేర్చానని చెప్పారు. ఈ పదవి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.కల్లూరు శాంతినగర్కు చెందిన మాజీ ఎంపీటీసీ అయిన కిరణ్కు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,మున్సిపాలిటీ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చందర్రావు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.






