11 May, 2026 | 1:26 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

90 దాటినా ప్రయాణం ఆగదు

16-10-2024 03:41 AM

తన ఏజ్‌పై ప్లకార్డుల ప్రదర్శనతో స్పందించిన శరద్ పవర్

ముంబాయి, అక్టోబర్ 15: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో క్యాడ ర్‌ను సమాయత్తం చేసేందుకు నిర్వహించిన సభలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవర్‌కు చేదు అనుభవం ఎదురైం ది. ఆయన సభలో మాట్లాడుతున్న టైమ్‌లోనే కొందరు యువకులు ‘84 ఏండ్లు’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. వీటిని చూసిన శరద్‌పవ ర్ తనశైలిలో స్పందించారు.

ప్లకార్డులు ప్రదర్శించిన వారిని ఉద్దేశిస్తూ ‘మీరేమీ బాధపడకండి.. మనది సుదీర్ఘ ప్రయాణం.. మహారాష్ట్రను సరైన మార్గంలో నడిపేవరకు ఈ వృద్ధుడు ఆగిపోడు. 84 ఏండ్లు కాదు.. 90 ఏండ్లు దాటినా రాష్ట్రం కోసం శ్రమిస్తూనే ఉంటా. అప్పటివరకు విశ్రమించను’ అని అన్నారు.