జాతీయ స్థాయి ప్రో కబడ్డీ పోటీలను మరిపించిన కత్రం కబడ్డీ లీగ్ పోటీలు
క్రీడాకారుల కు మరింత బలం ఇచ్చిన కత్రం చారిటబుల్ ట్రస్ట్
కోదాడ మే 6: కోదాడ బాలుర ఉన్నత పాఠశాల లో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో అనంత గిరి మండలం కిష్టా పురం గ్రామానికి చెందిన ఉన్నత విద్యా వంతులు కత్రం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞా రెడ్డి లు నిర్వహిస్తున్న నియోజక వర్గ స్థాయి కత్రం కబడ్డీ లీగ్ పోటీలు మంగళ వారం అర్ధరాత్రి వరకు జరిగి రస వత్తరంగా ముగిసాయి. మండల స్థాయిలో తల పడ్డ మెరికల్లాంటి 12 జట్లు గత రెండు రోజులుగా జాతీయ స్థాయి ప్రో కబడ్డీ నీ తలపించే విధంగా కబడ్డీ అభిమానులకు కను విందు చేశాయి.
మంగళ వారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో విన్నర్ గా మునగాల హాంటర్స్ ప్రైజ్ మనీ 75 వేలు, సెకండ్ ప్రైజ్ 60 అనంత గిరి హక్స్, తృతీయ బహుమతి 40 వేలు కోదాడ లయన్స్, చతుర్థ బహుమతి 20 వేలు మోతె బుల్స్ కైవసం చేసుకున్నాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రో కబడ్డీ ని తలపించే విధంగా క్రీడలు నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు , జిల్లా కబడి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావు, వెనిపల్లి శ్రీనివాసరావు,, పట్టణ వైద్యులు సురేష్, పార్థసారథి ఎంఇఓ సలీం షరీఫ్, గట్ల నరసింహారావు కత్రం సీతారామిరెడ్డి, కబడి లీగ్ వ్యాఖ్యాత మాధవి,కౌన్సిలర్ లు , కత్రం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ నిర్వాహకులు ముడియాల సత్య నారాయణ రెడ్డి, కత్రం కిరణ్ రెడ్డి, బుడిగ రామాంజ నేయులు , కోదాడ పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాతంగి సైదులు పంది తిరపయ్య బాగ్దాద్ గంధం పాండు కిష్టాపురం గ్రామ నాయకులు, అఫీషియల్స్, కోచ్ లు క్రీడా కారులు పాల్గొన్నారు.






