7 May, 2026 | 1:29 AM

ఘనంగా ముగిసిన వేకేషన్ బైబిల్ స్కూల్

07-05-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, మే 6(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ 299 పరిధిలోని కండ్లకోయ పట్టణంలో  గల గుడ్ షేపర్డ్ చర్చిలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వేకేషన్ బైబిల్ స్కూల్ (VBS) బుధవారం ఘనంగా ముగిసింది.ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన వేసవి బైబిల్ తరగతుల్లో దాదాపు 70 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమ ముగింపు రోజున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యులు గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు టిఫిన్ బాక్స్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గుడ్ షేపర్డ్ చర్చి పాస్టర్ రెవ.కె.కిషన్ రావు  ప్రభాకర్ నీ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దామన్నగారి ప్రభాకర్  మాట్లాడుతూ ఈ సంవత్సరం విబిఎస్‌లో ఇంతమంది పిల్లలు పాల్గొనడం చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు.

అంతేకాకుండా చిన్నారులందరూ క్రమశిక్షణతో కూడిన దేవుని వాక్యంలో ఎదగాలనీ పట్టణానికి సంఘ బిడ్డలందరినీ దేవుడు నిండుగా దీవించాలని ఆయన కోరుకుంటు న్నాననీ చెప్పారు. బహుమతుల పంపిణీ శిబిరంలో పాల్గొన్న పిల్లలకు అతిథుల చేతుల మీదుగా టిఫిన్ బాక్సులు, కేకులు సాఫ్ట్ డ్రింక్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి కందడి శశిధర్ రెడ్డి చిన్నారుల కోసం టిఫిన్ బాక్సులను స్పాన్సర్ చేయగా.దామన్నగారి సందీప్  కేకులు  బాదం మిక్స్ పానీయాలను స్పాన్సర్ చేశారు. కార్యక్రమ ముగింపు వేడుకలో హంసరాజు.బొక్క కృష్ణారెడ్డి. యంబ రాజు. ఎర్రోళ్ల దేవేందర్. ఎర్రోళ్ల మహేష్. సంఘ సభ్యులు. పిల్లల తల్లి దండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.