26 April, 2026 | 11:30 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కూలీ ముగించారు

19-03-2025 12:00 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ పుష్కర కాలం తర్వాత ‘జైలర్’తో మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఏడు పదుల వయసులోనూ రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించారు రజనీ. ఆ తర్వాత ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేసిన ‘వేట్టయాన్’ మాత్రం కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు రజనీ.

నాగార్జున ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది.

ఇలా భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా షూటింగ్ పూర్తయ్యిందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.