15 May, 2026 | 2:52 AM

గ్రీన్‌ఫీల్డ్ కాలనీ భూసమస్యను పరిష్కరించాలి

15-05-2026 12:29 AM

ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్, మే 14(విజయక్రాంతి): అల్వాల్ - ఖానాజిగూడలోని గ్రీన్ ఫీల్ కాలనీ కి సంబంధించిన భూ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.జ్ఞానేశ్వర్, కె. శ్రీనివాస్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ ను కోరారు.

కలెక్టరేట్ వద్ద జిల్లా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫీల్ కాలనీ భూ సమస్య కోర్టులో విచారణలో అందులో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఖానాజీగూడ, పద్మావతి నగరు కు చెందిన యు.ఎల్.సి పరిధిలోని ప్లాట్లకు (సర్వే నెంబర్ : 385 ను చూపిస్తూ), సర్వే నెంబర్స్ మార్చి, అల్వాల్ మున్సిపాలిటీ అధికారులు నాలుగు ఇళ్లకు అక్రమ పర్మిషన్లు ఇచ్చారని అన్నారు. రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమాల మూలంగా ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలు చోటు చోటు చేసుకుంటున్నాయన్నారు.

అలాగే, ప్లాట్ నెంబర్: 144 సర్వే నెంబర్ ను మార్చి, ఒరిజినల్ ఓనరు డాక్యుమెంట్స్ ను ఫాబ్రికేషన్ చేసి సంజీవ రెడ్డి అనే వ్యక్తి ప్లాట్లను ఆక్రమించుకున్నారని కూడా వారు  వెల్లడించారు. సర్వే నంబర్: 385 కు పాస్ బుక్ సృష్టించిన వ్యక్తి కూడా ఇతనేనని వారు ఆరోపించారు. అంతేకాకుండా,  385 సర్వే నెంబర్ ను వ్యవసాయ భూమిగా చూపిస్తూ, 2023 లో గ్రీన్ ఫీల్ కు సంబంధించిన ప్లాట్స్ కు సదరు వ్యక్తి పాస్ బుక్స్ కూడా చేసుకున్నారని, దీనిని ప్లాట్స్ ఓనర్స్ హై కోర్టు దృష్టికి తీసుకు వెళ్లగా హై కోర్టు సదరు పాస్ బుక్ లను 2025 ఫిబ్రవరిలో కోర్టు రద్దు చేసిందన్నారు. 

సర్వే నెంబర్ 375 పేరుతో కొంత మంది వేరే వ్యక్తులు ప్లాట్స్ ను ఆక్రమించుకుని అక్రమంగా ఇళ్లు కూడా నిర్మించుకున్నారని వారు ఆరోపించారు. గ్రీన్ ఫీల్ భూమికి సంబంధించి కోర్టులో కేసు  ప్రధానంగా ప్రభుత్వం మీద వేసినదే అయినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకొని కారణంగా, కేవలం గ్రీన్ ఫీల్ కాలనీ అసోసియేషన్ అడ్వికేట్స్ మాత్రమే కోట్లాడటం మూలంగా కేసు పరిష్కారం కావడం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాలని వారు కోరారు.