ఒద్యారంలో బడి బాట కార్యక్రమం
15-05-2026 12:30 AM
చొప్పదండి, మే 14 (విజయ క్రాంతి): గంగాధర మండలంలోని ఒద్యారం గ్రామం లో ఎంపీడీవో రాము ఆధ్వర్యంలో గురువారం బడి బాట కార్యక్రమం నిర్వహించా రు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం ఇంటింటికి వెళ్లి తల్లిదం డ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల ప్రా ధాన్యతను వివరించారు. తరువాత గ్రామ సభ నిర్వహించి మన ఊరి పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి అని వివరించారు.
ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, సౌక ర్యాలు, విద్యార్థుల భవిష్యత్తు అవకాశాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏపీసి చైర్మన్ మాధవి, సర్పంచ్ ఉమ, ఉప సర్పంచ్ గగన్, జీపీ సెక్రటరీ శ్యామల, పాలకవర్గ సభ్యులు, ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






