15 May, 2026 | 2:51 AM

కల్లు కాంపౌండ్‌కు వ్యతిరేకంగా ధర్నా

15-05-2026 12:28 AM

మద్దతు తెలిపిన మన్నె గోవర్ధన్ రెడ్డి

బంజారాహిల్స్, మే 14(విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో చింతల్‌బస్తి నుంచి సాయిబాబా గుడికి వెళ్లే ప్రధాన రహదారిపై నూతనంగా కల్లు కాంపౌండ్‌ను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మహిళలు, యువకులు గురువారం భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఆనంద్‌నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ వాసులకు ఇది ప్రధాన రాకపోకల మార్గం కావడంతో ఇక్కడ కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని వాపోయారు. వెంటనే ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాకు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జీ మన్నె గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్ హాజరై  ్త మద్దతును ప్రకటించారు. ఈ నిరసనలో స్థానిక నాయకులు విజయ్, నవీన్, శ్రీధర్ యాదవ్, ప్రవీణ్, శివరాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.