12-12-2025 01:40:37 AM
యంగ్ హీరో రోషన్ కనకాల తాజాచిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 13న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. రానా మాట్లాడుతూ.. “కలర్ ఫోటో’లానే ‘మోగ్లీ’ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది.
సింహం (బాలకృష్ణ) 12న వస్తుంది. మోగ్లీ 13న వస్తున్నాడు” అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “సందీప్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. తన సంకల్పం చాలా గొప్పది. బాలయ్య సినిమాతోపాటే ‘మోగ్లీ’ రావడం వల్ల ఇంకా చాలామందికి ఈ సినిమా గురించి తెలిసింది. బాలయ్య ఆశీస్సులతో సందీప్ ఎదగాలని కోరుకుంటున్నా” అని చెప్పారు. రోషన్ కనకాల మాట్లాడుతూ.. “మోగ్లీ’ తన ప్రేమ కోసం చేసిన యుద్ధం ఈ కథ. ప్రతి మనిషి జీవితంలో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధంలో గట్టిగా నిలబడి పోరాడాలి. మనల్ని మనం నమ్మాలి.
అందరూ ‘మోగ్లీ’ చేసే యుద్ధం లో తోడుండాలని కోరుకుంటున్నా. గెలిపించాలని కోరు తున్నా” అన్నారు. సాక్షి మాట్లాడుతూ.. “ఇది నా తొలి సినిమానే కాదు.. నా హార్ట్ కూడా” అన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘అఖండ వాయిదా పడి డిసెంబర్ 12కి రావడంతో చాలా ఒత్తిడికి గురయ్యాను. ఇది చాలా మంచి సినిమా. ఆ నమ్మకంతోనే డిసెంబర్ 13న వస్తున్నామ’న్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “కొన్ని పరిస్థితుల వల్ల ఒక పెద్ద సినిమాతో మేము రావాల్సివస్తోంది. ఒక రోజు ఆలస్యంగా వస్తుండటం వల్ల ఆ సినిమా చూసిన అందరూ మా సినిమా కూడా చూస్తారని కోరుకుంటున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్లు రవికాంత్ పేరేపు, హేమంత్ మధుకర్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.