ప్రేమకథ విషాదాంతం
29-06-2024 12:05 AM
- 24న ప్రియుడు మరణం.. శుక్రవారం ప్రియురాలు మృతి
రాజన్న సిరిసిల్ల, జూన్28 (విజయక్రాంతి): ఈ నెల 24న ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అదేరోజు ప్రియుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రి యురాలు శుక్రవారం మృతిచెందింది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన పెంట చందు, భాగ్యలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈనెల 24న కరీంనగర్‌లోని ఉజలపార్క్‌లో పురుగుల మందు తాగారు. ఆసుపత్రికి తరలించే లోపే చందు మృతిచెందాడు. భాగ్యలక్ష్మిని కు టుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.




