గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
29-06-2024 12:05 AM
హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్ నేతలు
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నేళ్లుగా పనిచేస్తున్న 1600 మందికిపైగా గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శుక్రవారం అన్ని జిల్లాల అధికారుకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ బోర్డు ఆదేశాలపై గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, నాయకులు కోడి మహేష్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.




