4 September, 2026 | 8:01 AM

మిల్లర్ల మాయాజాలం.. పెండింగ్ మామూలే!

04-09-2026 | 04:55am
  1. యేండ్ల తరబడి పెండింగ్ ఉన్న పాడి ఇవ్వాల్సిందే
  2. జిల్లావ్యాప్తంగా రూ. 120 కోట్ల వసూల్ పెండింగ్ 
  3. బస్తా లేనంతవరకు అధికారులు ఏం చేసినట్టు కొరవడిన ఇన్ఫోస్ట్మెంట్ అధికారుల తనిఖీ 
  4. కొన్ని మిల్లులకు ఒక్కొక్క చరిత్ర సొంతం 
  5. వసూలు చేస్తున్నాం : రవి నాయక్, డిఎం, మహబూబ్‌నగర్ 

మహబూబ్‌నగర్ సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి) : కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే... చెల్లించిన యెడల ఎలాంటి సమాచారం లేకుండానే నిర్ధాక్షణంగా విద్యుత్ ను నిలిపివేస్తుంది విద్యుత్ శాఖ (Electricity Department) . ఇతర ప్రభుత్వ ఆస్తులను అయినా ఇతర మరేదైనా సామాన్యులు ఎవరైనా ధ్వంసం చేసినట్టు తెలిసిన వారిపై ప్రభుత్వానికి నష్టం వాటిల్లే చేశారని తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవడం కూడా మనం చూస్తుంటాం. కాగా ఇక్కడ మాత్రం అది కుదరదు.

ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలు అది కూడా రైస్ మిల్లులు ఇక్కడ చర్యలు తీసుకుంటే రబీ తో పాటు ఖరీఫ్ సీజన్లో వరి కొనుగోలు చేసి ఎక్కడ పెట్టాలి? ఇన్ని నిబంధనలో తుంగలో తొక్కి ఆదాయమే పరమ అవధిగా అడుగులు వేసిన వారిపై చర్యలు అంతంత మాత్రమే ఉంటాయి.

పాడి కొనుగోలు చేసి రైస్ మిల్లులకు ఇచ్చి తిరిగి రైసును తీసుకోవలసి ఉన్నప్పటికీ బస్తా బియ్యం సంచి లేనంతవరకు నిరీక్షించి ఆ తర్వాత సీజ్ చేస్తారు అధికారులు. జిల్లావ్యాప్తంగా 120 కోట్లకు పైగా వివిధ రైస్ మిల్లు నుంచి డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నిబంధనలు అక్కర్లేదు అధికారులు చేసిందే చట్టం చెప్పిందే వేదం అనేలా రైస్ మిల్లులో నిర్వహణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

 కోర్టు మెట్లు ఎక్కుతున్న రైస్ మిల్లర్లు...

అధికారులు ఒత్తిడి చేస్తే కొందరు రైస్ మిల్లర్లు కోర్టు మెట్లు ఎక్కి మేము నష్టపోతున్నాం మాకు మరింత సమయం కావాలి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు గడువు ఇవ్వండి అనుమతి కోరుతున్నారు. కోర్టు మెట్లు ఎక్కిన వారి విషయంలో అధికారులు సైతం మెతక వైఖరి ప్రదర్శించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో అధికారులు తీవ్రస్థాయిలో చర్యలు తీసుకున్నందుకు వీలు లేకపోవడంతో పాటు పర్యవేక్షణ లోపం కూడా పూర్తిగా ప్రదర్శనమవుతుంది.

కొందరైతే తక్కువ మొత్తంలో రైస్ మిల్లు ను నిర్మాణం చేసుకొని అత్యధిక మొత్తంలో ప్రభుత్వం నుంచి ధాన్యం దిగుమతి చేసుకొని ఆ తర్వాత చూద్దాంలే అనే విధంగా కూడా వివరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా ముగింపు పడకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటుండ్రు.

పర్యవేక్షణ అడుగులలో పూర్తి నిర్లక్ష్యం

 పర్యవేక్షణ అడుగులలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల గాదిర్యాల దగ్గర శ్రీరామ రైస్ మిల్ ను సీజ్ చేసిన అధికారులు ఆ మిల్లులో ఎలాంటి ధాన్యం లేదని తేల్చారు. కనీసం ఒక బస్తా ధాన్యం లేనంతవరకు ఎందుకు నిర్లక్ష్యంగా అధికారులు ఉండాల్సిందో సమాధానం మాత్రం ఇప్పటికి బయటకు రాలేదు.

ఇలా ఒక్కొక్క రైస్ మిల్లో ఒక్కొక్క విధానంలో ముందుకు సాగుతూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు పెండింగ్ పెడుతూ నిర్వహణ చేయడం ఎంతవరకు సమంజసమో అధికారులు తేల్చాలి. వచ్చె నెల చివరిలోపు బకాయిలు 100% చెల్లించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. 

వసూలు చేస్తున్నాం

నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై పర్యవేక్షణ చేసి ఫైన్లు విధించి వసూలు చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. 

 రవి నాయక్, డీఎం, మహబూబ్ నగర్