09-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్, జనవరి 8 (విజయ్‌క్రాంతి): సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో గురువారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో పలు ప్రాంతాలలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న.
ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో రోడ్డు అండర్ బ్రిడ్జి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి లతో పాటు లిమిటెడ్ హైట్ సబ్ వేల నిర్మాణం కొరకు గతంలో అందజేసిన వినతిపత్రాల సంబంధించిన పురోగతి పై రైల్వే ఉన్నతాధికారులతో ఎంపీ డీకే అరుణ సమీక్ష నిర్వహించారు. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మిగతా వాటికి త్వరితగతిన శాంక్షన్ వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నిఎంపీ డీకే అరుణ కోరారు..