09-01-2026 12:00:00 AM
జిన్నారం/అమీన్ పూర్, జనవరి 8: గడ్డపోతారం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించాలని, పార్టీ అభ్యర్థుల గెలుపు, చైర్మన్ పీఠం కైవసమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ నాయకులు రాజు గౌడ్, మంత్రి అశోక్ పిలుపునిచ్చారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తల పాత్ర, బూత్ లెవల్ నుండి పార్టీ బలోపేతం, తదితర అంశాలపై చర్చించారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను సైతం ప్రజలకు వివరించాలని తెలిపారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కమిటీల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గడ్డపోతారం మున్సిపల్ కార్యాచరణ సిద్ధం చేసి, ప్రణాళికతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు అండగా నిలిచి, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు రూపంగా ప్రజలు తమ మద్దతును తెలియజేయాలని పిలుపునిచ్చారు.