calender_icon.png 12 January, 2026 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన ఎరువులు,విత్తనాలు విక్రయించాలి

09-01-2026 12:00:00 AM

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కసరత్తు ః కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, జనవరి 8: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం రామయంపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా దుకాణంలో నిల్వ ఉన్న ఎరువుల నాణ్యత, బరువు, ధరల పట్టిక, బిల్లుల జారీ విధానం, స్టాక్ రిజిస్టర్ తదితర అంశాలను సవివరంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు.

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ ఎరువులు విక్రయించినా, అధిక ధరలు వసూలు చేసినా చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు కనిపిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ వెంట మెదక్ ఆర్డిఓ రమాదేవి, వ్యవసాయ అధికారులు ఉన్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు... 

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రామాయంపేట మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, డిస్పాచ్ సెంటర్స్ వంటి అంశాలను పరిశీలించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.