calender_icon.png 31 July, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం

29-07-2025 12:22:45 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్, జూలై 28 (విజయక్రాంతి): వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా సోమవారం  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని పరిమళకాలనీ, సురేంద్రపూరి కాలనీలో  రూ.1 కోటి 10లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన  వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

వీటితో ప్రాంత ప్రజలకు నాణ్యమైన రహదారి, మురుగు నీటి పారుదల సౌకర్యాలు కల్పించబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రజల నిత్య జీవితానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనే మా ప్రధాన ధ్యేయం.  ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం పక్కా సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మిస్తున్నాం. అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఇది మా ప్రామాణికతకు నిదర్శనం అని వివరించారు.

ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతున్నామని అన్నారు. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

56 వ డివిజన్ కి  దాదాపు 1 కోటి 60 లక్షల రూపాయలు నిధులు కేటాయించాం అభివృద్ధికి అధికారులకు, ప్రజలు, అందరు సహకరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిరంగీ సునిల్, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, మహిళ అధ్యక్షురాలు శనిగరపు అనిత డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.