17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గంజాయి అడ్డగా రైల్వే స్టేషన్!

21-02-2026 02:18 AM

పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా.. ఆగని అక్రమ దందా

యువత భవిష్యత్‌ను కబళిస్తున్న గంజాయి భూతం 

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20: గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల దందా జోరుగా సాగుతున్నది. అక్రమ దందాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టీ ఉక్కుపాదం మోపిన ప్పటికీ, ఆగడం లేదు. అది పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అక్రమ రవాణాకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అడ్డాగా మారింది. ఇటీవలే బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో మహారాష్ట్ర నుంచి అక్రమంగా  తీసుకొచ్చిన గంజాయితో పట్టుబడిన యువకుడి ఘటన ఇదే విషయాన్ని మరోసారి రుజువుచేస్తోంది.

గంజాయి రవాణాపై రైల్వే స్టేషన్‌పై బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు  గట్టి నిఘా పెట్టి ఒకరిని అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనతో గం జాయి అక్రమ రవాణా మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా గం జాయి రవాణా సాగుతుంది. గంజాయి ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నది. గంజాయి లభించే అడ్డాలు కొన్ని పట్టణంలో ఏర్పడటంతో చిన్న వయసు పిల్లలు మత్తు పదార్థాల భారిన పడుతున్నారు. 

మహారాష్ట్ర నుంచి రవాణా..

మత్తు పదార్థాలు, గంజాయి రవాణాకు మహారాష్ట్ర ప్రధాన అడ్డాగా మారిందనీ సమాచారం. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలు తెలం గాణ, ఏపీలకు పెద్ద ఎత్తున గంజాయి, మత్తు పదార్థాల దిగుమతీ దందాజోరుగా సాగుగుతున్నదనీ తెలుస్తోంది. వాటి వ్యసనాన పడిన యువకులే చివరికి ఈ దందాను కొనసాగిస్తున్నారనీ తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయాన పోలీసులే ప్రకటించడం గమనార్హం. గంజాయి రవాణా లాభాదాయక వ్యాపారంగా మార్చుకుని, ఇతర ప్రాంతాలకు పెద్దఎత్తున సరఫరా చేస్తున్నారనే సమాచారం. 

గంజాయి కల్చర్ రాను రానూ వ్యవస్థీకృతమైతే నేరపూరిత సంస్కృతికి ఆజ్యం పోస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు పోలీసు యంత్రాంగానికి పెద్ద సమస్యగా మారింది. గంజాయి విష సంస్కృతిలో చిక్కుకున్న కొందరు యువకులు బయట పడలేక గింజుకుంటున్నారు. ఈ అక్ర మ వ్యాపారం నుంచి బయటపడ లేక అందులోనే కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితి లో గంజాయి ప్రబావం నుంచి యువత విముక్తి అనుకున్నంత ఈజీ కాదు. యువతను ముందుగా గంజాయికి దూరం చేయాలి.

అక్ర మ రవాణా మార్గాలను పూర్తిగా మూసివేయాలి. మహారాష్ట్ర, నుంచి తెలంగాణ రాష్ట్రo లోకీ  అడుగుపెట్టకుండా సరిహద్దులో గట్టినిఘాను మరింత పటిష్టం చేయాలి. అదేపనిగా గంజాయి, మాదక ద్రవ్యాలపై విసృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలీ. ఇప్పటికే  ఇలాంటి కార్యక్రమాలు పోలీసులు జిల్లాలోనీ అన్నీ పీఎస్ పరిధిలలో చేపడుతూనే ఉన్నారు. కానీ అంతగా అవి సరిపడుతలేవు. కనుక గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. అందుకే ఈ దందాకు పుల్ స్టాప్ పడటం లేదు.

గంజాయి మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ వంటి సరిహద్దు ప్రాంతాల్లోకి దిగుమతీ అవుతున్నది. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలోనీ అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నదని తెలుస్తోంది. ఈ రూట్లలో దిగుమతి అయిన గంజాయి కోల్ బెల్ట్ ప్రాంతాల్లోని మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృ ష్ణాపూర్, బెల్లంపల్లి, గోలేటి, తాండూరు పట్టణాల్లో గంజాయి విక్రయ బృందాలకు చేరు తున్నది. కోల్ బెల్ట్‌లో గంజాయి సరఫరా కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న బృందాలు పనిచేస్తున్నాయనీ సమాచారం. 

దిగుమతైన గంజాయినీ అధిక రేట్లతో వ్యసనపరులకు అందిస్తున్నారనీ తెలుస్తోంది. ప్రధాన పట్టణాలతో పాటు చిన్న పెద్ద పట్టణాలకు అనుకోని ఉన్న  గ్రామాలకు కూడా ఈ దందా విస్తరించింది. ఒక్క మాటలో చెప్పాలం టే.. గంజాయి అక్రమ దందా ‘మూడు పూలు ఆరు కాయలుగా‘ వర్ధిల్లుతున్నది. ఈ దందా ను కొందరు లాభదాయక బిజినెస్ గా మలుచుకున్నారని తెలుస్తున్నది. 

పోలీసుల కొరడా..

గంజాయి భూతాన్ని  పోలీసులు తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగా అక్ర మ రవాణా పై కొరడా ఝులిపిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో విపరీతంగా తనిఖీలు చేపట్టారు. అవి కొంతమేరా ఫలించాయి. ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరంగా మారాయి. దాని ఫలితంగా జిల్లాలోనీ మూడు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసు లు  పెద్ద సంఖ్యలో నమోదు చేస్తున్నారు. అందుకు కారకులను పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. మొత్తంగా కమిషనరేట్ పరిధిలోనీ జిల్లాలో పోలీసులు నమోదు చేసిన కేసు లు ఇలా ఉన్నాయి.

బెల్లంపల్లిలో 25 మంచిర్యాలలో 20, జైపూర్ లో 13 వరకూ ఇప్పటి వరకూ కేసులు నమోదు చేశారు. పోలీసులు కేసుల పరంగా పురోగతిలో కనిపించినా గంజాయి భారిన నుంచి యువతను కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. గత పాలకులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువతను బలిచ్చారనే ఆరోపణలు ఇప్పటికి ప్రజల్లో ఉన్నా యి.

అలాగే గంజాయి భూతాన్ని సమా జం నుంచి తరిమిట్టడం ఒక్క పోలీసులతోనే సాధ్యం కాదు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు ఈ విషయంలో ప్రేక్షక పాత్ర నుంచి బయట పడాలి. ఏదిమైనా గంజా యి రక్కసి యమ డేంజర్ అనే విషయం అందరూ గుర్తించాలి. దాని భరతానికి ఇకనైనా అందరూ నడుము బిగించాలి. ఇది ప్రతిఒక్కరి బాధ్యత..