7 March, 2026 | 4:18 PM

Breaking News

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •   ఎల్‌పీజీ ధరల పెంపు.. నిరసనకు మమత పిలుపు   •  

వసతుల కల్పనకు కదలిన యంత్రాంగం

07-03-2026 12:00 AM

చేవెళ్ళ మార్చి 6 (విజయక్రాంతి): కొత్తగా కొలువుదీరిన చేవెళ్ళ పాలకవర్గం మున్సిపల్ అధికార యంత్రాంగం ప్రజల మౌలిక వసతుల కల్పనకు కదిలింది. శుక్రవారం 18వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి కమిషనర్ వెంకటేశం, 15 వార్డు కౌన్సిలర్ బండారు శైలజాఆగిరెడ్డితో కలిసి 18 వార్డు కౌన్సిలర్ మంగలి కళ్యాణి యాదగిరి అంగడి బజార్ కాలనిలో పర్యటించారు. వార్డు ప్రజలు సరైన డ్రైనేజి, సీసీ రోడ్ల లేక సతమతమైతున్నామని పర్యటనకు వెళ్లిన పలకవర్గం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

కాలనీలో కొందరు ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కౌసిలర్ సభ్యుల ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వార్డు స్థితి గతులు చూసిన పాలక వర్గ సభ్యులు సానుకూలంగా స్పందించారు. వార్డు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని భరోసనిచ్చారు. అధికారులు రాఘవేందర్ తదితరులు