7 March, 2026 | 3:54 PM

పరిశుభ్రత అందరి బాధ్యత

07-03-2026 12:00 AM

కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ 

కొడంగల్, మార్చి -6 (విజయక్రాంతి) పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొడంగల్ పట్టణం గాంధీ నగర్ లో మున్సిపల్ చైర్మన్ నందరం ప్రశాంత్ మరియు అధికారులు సిబ్బంది ప్రారంభించి ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని పట్టణాన్ని సుందరంగా ఉంచడంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు రాజకీయ ప్రజాప్రతినిధులు,పట్టణ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.