calender_icon.png 26 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోచుకున్న సొమ్ముతో మీడియాను మేనేజ్ చేస్తున్నారు

26-09-2025 01:00:02 AM

  1. 10 ఏళ్లలో దోచుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు 

బిఆర్‌ఎస్ దోచుకున్నది కక్కిస్తామన్న హామీ ఏమైంది 

20 నెలల పాలనలో ఏం చేయాలో వాళ్లకు తెలియడం లేదు 

మనుషులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ దుర్గామాతను వేడుకున్న 

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు 

సిద్దిపేట, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో దోచుకున్న డ బ్బుతో మీడియాను మేనేజ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నా రు. గత పదేళ్లలో కుటుంబ సభ్యులు దోచుకున్న ధనాన్ని కక్కించి, ఆ సొమ్మును ప్రజ లకు పంచి పెడతామన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు.

గురువారం సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ కార్యాల యంలో పండిత్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల భర తం పడతామంటూ సవాల్ చేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన ఆ ఊసే లే దంటూ విమర్శించారు. ఎలా పరిపాలించా లో ఏం చేయాలో తెలియని దుస్థితిలో పా లన కొనసాగుతుందంటూ ఎద్దేవో చేశారు.

దేశంలో జాతీయ రహదారులపై తప్ప రహదారులపై కారు కూడా నడవలేని పరిస్థితి ఉందన్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు గుంతల మయంగా మా రాయన్నారు. పూటకో మాట మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దో బూచులాడుతుందని విమర్శించారు. ఉపాధ్యాయులను సెలవులు రద్దు చేసుకొని ఉ ద్యోగం చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు.

42 శాతం బీసీ రిజర్వేషన్ ఇ స్తామని ఇప్పటివరకు జీవో విడుదల చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. ఉపాధ్యాయులలో అధికంగా మహిళలే ఉంటారని పెద్ద బ తుకమ్మ పండుగకు సెలవులు ఇవ్వకపోవ డం పై ప్రభుత్వం పునరా ఆలోచన చేయాలని కోరారు.ప్రకృతి, పర్యావరణంలో జరిగే మార్పులకు మనుషుల ప్రవర్తననే కారణమ ని, మనుషులలో ప్రవర్తన మారి మంచి బు ద్ధి ప్రసాదించాలని దుర్గామాతను కోరుకున్నట్లు తెలిపారు.

సిద్దిపేటలో పలు దు ర్గామాతలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, నాయకులు వంగ రామచంద్ర రెడ్డి, గుండ్ల జనార్ధన్, బాసంగారి వెంకట్, సంతోష్ గుప్తా, కెమ్మసరం సంతోష్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.