calender_icon.png 26 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్‌నాథ్‌కు గుర్తింపు

26-09-2025 12:58:38 AM

రాష్ట్ర బీజేపీ నేత మర్రి బాలకిషన్

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): పాత్రికేయ వృత్తికి న్యాయం చేస్తున్నందుకే సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్ నాథ్ కు గుర్తింపు లభిస్తుందని సినియర్ బీజేపీ నేత టెలికామ్ బోర్డు మాజీ డైరెక్టర్ మర్రి బాలకిషన్ అన్నారు. జర్నలిస్టుల జాతీయ సంఘం అయిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఇండియా) ఉపాధ్యక్షులుగా, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీ జే ఏ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎన్నికయ్యారు.

జాతీయ స్థాయిలో పదవి సాధించినందుకు, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను  కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించినందుకు రాజేందర్ నాథ్ ను ఎల్లారెడ్డి సెగ్మెంట్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నేతలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకిషన్ మాట్లాడుతూ...గ్రామీణ స్థాయి పాత్రికేయునిగా వృత్తిలో చేరి 41ఏళ్లుగా పత్రిక రంగంలో స్టేట్ బ్యూరో గా పని చేయడం అభినందనీయం అన్నారు. బీజేపీ సినియర్ నేత, మాజీ ఎల్లారెడ్డి సర్పంచ్ బత్తిని దేవేందర్ మాట్లాడుతూ...జర్నలిస్ట్ గా వృత్తిలో రాణిస్తు... సామాజిక సమస్యలను పత్రిక ద్వారా బహిర్గతం చేసి ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేలా చేసారన్నారు.

వెంకటాపురం అగ్రహారం కుంభాకోణాన్ని బయటకు తీసారని, నిజాంసాగర్ ప్రాజెక్టు పై ప్రభుత్వం కదిలించేలా వార్తలు రాసి భారీ నిధులు మంజూరు అయ్యేలా చేసారన్నారు. అవినీతికి దూరంగా ఉంటు... వృత్తిలో రా ణించిన ఆయన్ను అభినందించారు. అనంతరం మండల బీజేపీ అధ్యక్షులు పెద్దేడ్ల నర్సింలు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నా సమయంలో ఆనాడు నక్సలైట్లు పోలీస్ కానిస్టేబుల్, అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేస్తే, ఒక జర్నలిస్ట్ గా రాజేందర్ నాథ్ ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య - మధ్యవర్తిత్వం చేసిన ప్రెస్ టీంలో సభ్యునిగా వెళ్లి కిడ్నాప్ అయిన వా రు క్షేమంగా రావడానికి కృషి చేసి, ఆనాడు ఉన్నాతధికారులనుండి ప్రశాంస పత్రాన్ని అందుకున్నారని గుర్తు చేసారు.  ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షులు అగల్ దివిటీ రాజేష్, .ప్రధాన కార్యదర్శి పద్మ శ్రీను, మాజీ మండల అధ్యక్షులు ఎస్ ఎన్.రెడ్డి, ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, అల్లం పండరి, కోశాధికారి గజనన్ పాల్గొనారు.