calender_icon.png 26 September, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

26-09-2025 01:00:27 AM

8 మందికి తీవ్ర గాయాలు 

డిచ్పల్లి (విజయ క్రాంతి): డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 44) పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఫలితంగా బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.

జాతీయ రహదారి పై నిర్లక్ష్యంగా లారీని నిలిపించడంతో ఈ ప్ర మాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది నిర్మల్ నుంచి హైదరాబాద్  వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అజాగ్రత్త నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సు లో  27 మంది ప్రయాణికులు నాకు తెలుస్తోంది. 8 మందికి తీవ్ర గాయాలు య్యాయి. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి ఎస్త్స్ర షరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్త్స్ర తెలిపారు.