20-01-2026 12:23:56 AM
ఉన్నతులుగా ఎదిగి తిరిగి మన ప్రాంతానికి సేవ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాబిష్టం మేరకే ప్రజాపాలన
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నాగర్ కర్నూల్ జనవరి 19 (విజయక్రాంతి)ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిష్టం మేరకే పని చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం నాగర్ కర్నూల్ కేసరిసముద్రం చెరువు అలుగు వద్ద 10 కోట్ల నిధులతో నిర్మించేహై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన,
తొమ్మిది కోట్ల నిధులతో నిర్మించే నూతన జూనియర్ కళాశాల, 10 కోట్ల నిధులతో నిర్మించిన జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభం, మరో రెండు కోట్ల నిధులతో ని ర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియ ర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభ వేదికపై తాను ప్రసంగించే కంటే ముం దే విద్యార్థులతో మాట ముచ్చట కలిపారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను అందుకు ప్రభుత్వం నుండి అందుతున్న సహాయ సహకారాలు సౌకర్యాలు వంటి అంశాలను ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకే ప్రజా పాలన నడుస్తుందని అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఆదివారం సమ్మ క్క సారక్క వనదేవతల సాక్షిగానే క్యాబినెట్ సమావేశమయ్యిందన్నారు. విద్య వైద్యం, రైతాంగం, మహిళా సాధికారత వంటి అంశాలపైనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా వారి సమస్యలను మంత్రి ముందు ధైర్యంగా చెప్పుకున్నారు.
వెంటనే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను అందిస్తున్నామని, స్పోరట్స్, స్కిల్, ఆరట్స్ యూనివ ర్సిటీలను ఏర్పాటు చేశామన్నారు. నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 109 ట్రామా కేర్ కేంద్రాలు, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ‘ప్రణామ్’ కేంద్రాలు స్థాపించామన్నారు. రూ.200 కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, పోషకాహారం, నైపుణ్య విద్య విధా నం అవసరమని అన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకు రూ.70 లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
పేదలకు అవసరమైన విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, మహిళా సాధికారతలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. వారితోపాటు స్థానిక ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, తదితర జిల్లా శాఖ అధికారులు ఉన్నారు.