calender_icon.png 20 January, 2026 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ.. మహిళా శక్తికి ప్రతీక

20-01-2026 12:24:17 AM

మొయినాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): ఇందిరమ్మ మహిళా శక్తికి ప్రతీక అని కాలే యాదయ్య అన్నారు. మహిళల అభ్యున్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని మొయినాబాద్ కేంద్రంలోని అంజనీదేవి గార్డెన్లో మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి లు పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, డ్వాక్రా మహిళలకు రుణాలు అందించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు మహిళల ఐక్యతకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, మున్సిపల్ మేనేజర్ నరేందర్, ఆర్వో జమీల్, అశోక్, శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, రాఘవేందర్, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, మాజీ జడ్పీటీసీ కాలే యాదయ్య, కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకట్ రెడ్డి, హనుమంత్ యాదవ్, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.