15 April, 2026 | 6:23 AM

ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సన్మానం

15-12-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14 (విజయ క్రాంతి): లింగాపూర్ మండలంలోని చోర్పల్లి, పిట్టగూడ గ్రామ పంచాయ తీల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే కోవ లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల్లో గెలుపొందిన నూతన ప్రజాప్రతినిధులను ఎమ్మె ల్యే శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్యా నాయక్, కిషన్, నాగోరావు, కొండు మారుతీ పటేల్, జంగు, మనోహర్, దస్రు, ప్రేమ్ కుమార్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.