calender_icon.png 15 December, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో బీఆర్ఎస్ హవా..

14-12-2025 10:33:17 PM

* 8 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపు

* 7 స్థానాల్లో కాంగ్రెస్

* బీజేపీ 1

* ఒకటి ఇండిపెండెంట్

చిగురుమామిడి (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాఖ అయిన చిగురుమామిడి మండలంలో బీఆర్ఎస్ సత్తా చాటింది. 8 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఏడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా,  బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. మొత్తం 17 గ్రామాల్లో 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

లంబాడిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కాటం సంపత్ రెడ్డి, గునుకులపల్లిలో బీజేపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి, కొండాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మార్క రాజ్ కుమార్ గౌడ్, సీతారాంపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గోగూరి లక్ష్మి, ఓగులాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రమ, గాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సన్నీళ్ల కవిత, ముదిమాణిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయిని రమేష్, ఉల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి అలువాల శంకర్, రామంచలో బీఆర్ఎస్ అభ్యర్థి ఒంటెల కిషన్ రెడ్డి, ఇందుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపుల నరేందర్, సుందరగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి జంగ శిరీష వెంకటరమణారెడ్డి, పీచుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి పీచు సత్యనారాయణ రెడ్డి, ముల్కనూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి సాంబారి భారతవ్వ కొమురయ్య, నవాబుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గూళ్ల రజిత రాజు, రేకొండలో స్వతంత్ర అభ్యర్థి అల్లెపు సంపత్, బొమ్మనపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొంకట మౌనిక, చిగురుమామిడిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకవరం మఠం భవాని ప్రసాద్ విజయం సాధించారు.