15-12-2025 12:00:00 AM
ప్రచారంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు, డిసెంబర్ 14 (విజయక్రాంతి): చీకటిగా ఉన్న గ్రామాలలో వెలుగు లు నింపింది కేసీఆర్ ప్రభుత్వమని, అందుచేతనే ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు నిచ్చారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల, ఉండం, సుంకిడి, కొత్తూరు, లింగి, కూచులపూర్ గ్రామాలలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థుల గెలుపు కోసం ఆదివారం ఎమ్మెల్యే గడపగడప ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయ్యాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు నెరవేర్చట్లేదని, ముసలవ్వలకు 4 వేల పెన్షన్ అని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
రైతులకు రూ. 15.వేలు రైతుబంధు అందిస్తానని చెప్పి 15 రూపాయలు కూడా ఇయ్యలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, మాడూరి మల్లేష్, తోట శ్రీనివాస్, ప్రధాన్ వామన్, ప్రమోద్, పోచన్న,తోట అశోక్, మహేష్ దేశముక్, ప్రేమ్ సింగ్, తదితరులు ఉన్నారు.